అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క

  • మూడు డీఏ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామన్న మల్లు భట్టి
  • గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని విమర్శ
  • ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడి

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏ బకాయిలను తమ ప్రభుత్వం త్వరలోనే క్లియర్ చేయబోతున్నట్లు ప్రకటించారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, అందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన వాటానే రూ. 4,571 కోట్లు ఉందని భట్టి విక్రమార్క వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలను మానవతా కోణంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అలాగే ఉద్యోగుల కోసం క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు కూడా అందజేశామని గుర్తుచేశారు.

Mallu Bhatti Vikramarka
Telangana government employees
DA arrears
Telangana budget
BRS government
Cashless health cards
Government salaries
Telangana
Deputy CM

More Telugu News